మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. సంతానం కలగాలని అమ్మవార్లకు మహిళలు ముడుపులు కట్టారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.


