ఎన్నికల నియమావళిని పాటించాలి
నర్మెట: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండలకేంద్రం పంచాయతీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్నికలకు అంతరాయాలు కల్పిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై నైనాల నగేష్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, కార్యదర్శులు పాల్గొన్నారు.
జనగామ మండలంలో..
జనగామ రూరల్: జనగామ మండలంలోని ఐదు క్లస్టర్లలో సర్పంచులు, వార్డు మెంబర్లకు గాను నా మినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం అయింది. వడ్లకొండ క్లస్టర్‌ను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎంపీడీవో బి. మహేశ్, తహసీల్దార్ హుస్సెన్, ఎంపీఓ సంపత్‌కుమార్, ఎస్‌ఐ భరత్ పరిశీలించారు.
49 వార్డులు ఏకగ్రీవం
జఫర్‌గఢ్: మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ చేపట్టారు. మండలంలో సర్పంచ్ స్థానాలకు 189 నామినేషన్లు వేయగా ఏ ఒక్కటీ కూడా తిరస్కరణకు గురికాలేదు. వార్డు స్థానానికి వచ్చిన 471 నామినేషన్లకు గాను 5 తిరస్కరణకు గురయ్యాయి. కాగా ఆయా గ్రామాల్లో పలు వార్డు స్థానాలకు అభ్యర్థుల నుంచి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో 49 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ సుమన్ తెలిపారు. ఇందులో అల్వార్‌బండాతండా గ్రామపంచాయితీ నుంచి 6 గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా లక్ష్మినాయక్‌తండా నుంచి 7, తీగారం 3, కోనాయిచలం 5, దుర్‌ాగ్యనాయక్‌తండా 5, సాగరం 9, తిడుగు 4, ఉప్పుగల్లు 1, హిమ్మత్‌నగర్ 1, తిమ్మాపూర్ 1, షాపల్లి 3, మగ్ధుంతండా నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


