ఆయిల్‌పామ్‌తో నిరంతర ఆదాయం
జనగామ రూరల్: దేశంలో వంట నూనెల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకుగాను రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మొక్కల అందజేత నుంచి డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు, తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలనిస్తోంది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఆయిల్‌పామ్ ధర టన్నుకు రూ.16,500 పెరిగే అవకాశమున్నందున రైతుకు మంచి ధర పలికి మేలు జరుగనుంది. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 7,457 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటడంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
లాభసాటిగా ఆయిల్‌పామ్
రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును లాభసాటిగా చేయాలని కొత్త రైతులను ప్రోత్సహించేందుకు మంచి రేటు అందిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయిల్‌పామ్ సాగుపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సాగు రకాలుపెంచేలా కృషి చేస్తున్నారు.
నికర ఆదాయానికి అవకాశం
ఈ పంట సాగుతో 4–30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. చీడపీడల బెడద ఉండదు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, తదితర అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుంది. జిల్లాలో ఈ ఏడాది సుమారు 792 ఎకరాలకు డ్రిప్ పరికరాలకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ వార్షిక ప్రణాళికలో భాగంగా 216 ఎకరాల్లో రైతులు మొక్కలను నాటారు.
పంట సాగులో జిల్లాది 5వ స్థానం
రాయితీలతో సాగును ప్రోత్సహిస్తున్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
జిల్లా వ్యాప్తంగా 7,457 ఎకరాల్లో సాగు


