రెండో విడత నామినేషన్లు షురూ
జనగామ: జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామపంచాయతీలు, 710 వార్డుల పరిధిలో ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు సంబంధించి నర్మె టలో(4క్లస్టర్లు), జనగామలో (5), తరిగొప్పులలో (5), బచ్చన్నపేటలో (5) మొత్తంగా 19 క్లస్టర్ల వారీగా ఆయా రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులతో పాటు స్వతంత్రుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ అభ్యర్థులకు 57, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా నేడు, రేపు(మంగళవారం) దశమి, ఏకాదశి కలిసొచ్చిన మంచి రోజులతో నామినేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 27వ తేదీ నుంచి 29 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేసి చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల అర్హత వివరాలను ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అప్పీళ్లకు అవకాశం ఇవ్వగా, 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ల పరిష్కారానికి అవకాశం కల్పించారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌న్‌ఉపసంహరణ చేసుకున్న అనంతరం, తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఒక్క స్టేషన్‌ఘన్‌పూర్‌లో సర్పంచ్‌కు 689 నామినేషన్లు రాగా, ఇందులో వివిధ కారణాల చేత 30 తిరస్కరించడం గమనార్హం. రఘునాథపల్లిలో 320 వార్డులకు 7 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో పాటు 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
తొలి రోజు సర్పంచ్–57,
వార్డులకు 90..
స్టేషన్ ఘన్‌పూర్‌లో చెల్లుబాటు
అభ్యర్థుల జాబితా వెల్లడి


