
విద్యార్థుల భాగస్వామ్యం అవసరం
● రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి
జనగామ రూరల్: బోధనలో విద్యార్థుల భాగస్వామ్యంతోనే ఆశించిన అభ్యసన సామర్థ్యాలు సాధిస్తామని పాఠశాల విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం చౌడారంలో కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ భోజన్నతో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. బోధన తీరును పరిశీలించి విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోధనలో కృత్యాలను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ రాణి పాల్గొన్నారు.