
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
చిల్పూరు: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ అన్నారు. మల్కాపూర్ గ్రామంలోని పీహెచ్‌సీని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా వాఛ్యతండాలో మానిటర్ ఇమ్యునైజేషన్‌ను ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కమల్‌హాసన్, డాక్టర్ అశోక్‌లతో కలిసి పరిశీలించారు. వెంకటాద్రిపేటలో డెంగీ పాజిటివ్ వచ్చిన పేషంట్‌తో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలి పారు. గ్రామంలో చెత్త చెదారం, మురుగు నీ రు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి డెంగీ వ స్తుందని, పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీలో డాక్టర్ కుశాలి, డాక్టర్ శ్రవణ్ ఆధ్వర్యంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమయ పాలన పా టించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన మందులు అందజేయాలన్నారు.