
రెవెన్యూ అదనపు కలెక్టర్ హోదా పెంపు
జనగామ: రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ హోదాను పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న రోహిత్ సింగ్‌కు ప్రభుత్వం ఇక్కడే పూర్తి స్థాయి అదనపు కలెక్టర్ హోదాను కల్పించింది. ఈ మేరకు ఏసీ రోహిత్‌సింగ్‌ను పలువురు అభినందించారు.