
వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం భక్త జన సందోహం మధ్య గోవింద నామస్మరణలతో అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా స్వామి వారి వార కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ధర్మకర్తలు గనగోణి రమేశ్, తాళ్లపల్లి బుచ్చయ్య, రత్నాకర్‌రెడ్డి, చల్ల వెంకటరమణాదేవి, గోలి రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మళ్లికార్జున్, మహేష్, గాదె శేఖర్, హరిశంకర్, రాజేష్, విశాల్ పాల్గొన్నారు. అనంతరం భక్తులకు హైదరాబాద్‌కు చెందిన అఖిల్ శర్మ– వనిత కల్యాణి, వరంగల్‌కు చెందిన మేర్గు నవీన్–వీణ, విశ్వతేజ దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.