
ఓపెన్ స్కూల్ ఓ వరం
● తెలంగాణ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి
పాలకుర్తి టౌన్: ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాలతో పాఠశాల స్థాయిలోనే చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఓ వరమని ఓపెన్ స్కూల్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అడ్మిషన్స్ చేయించాలని, డ్రాపౌట్ లేకుండా చూడాలని చెప్పా రు. అలాగే ఉల్లాస్ ప్రొగ్రాంలో భాగంగా నిరక్షరా స్యులను అక్షరాస్యులుగా చేసే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలికల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సతిన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీఓ విజయ్‌కుమార్‌రెడ్డి, టాస్ కోఆర్డినేటర్ శంకర్‌రావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ రవి, హెచ్‌ఎంలు శోభారాణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్, అశోక్, బలరాం, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.