
సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ఇందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, డీఆర్డీఓ వసంత, ఎంపీడీఓ రాములు, కాంగ్రెస్ నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కమ్మగాని నాగన్న, ఎండీ.నజీర్, యాకూబ్, పుల్లి గణేష్, బైరు భార్గవ్, పన్నీరు వెంకన్న, కమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు.