
గడువు మూడురోజులే..
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) రాయితీకి ఇచ్చిన మరో అవకాశం గడువు మూడు రోజుల్లో ముగియనుంది. ప్లాట్ల యజమానుల నుంచి అనుకున్న మేర స్పందన లేకపోవడంతో 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఆరోసారి ఈనెల 30వ తేదీ వరకు గడు వు పొడిగించింది. జనగామ పురపాలికలో 2020 సంవత్సరం ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లు 18,095 వచ్చా యి. ఇప్పటి వరకు 2,823 మంది ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 1,979 దరఖా స్తులు అండర్ ప్రాసెస్‌లో ఉన్నారు. ఇందులో 2,823 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇప్పటి వరకు పురపాలికకు రూ.6.68 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోండి
ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం పొడిగించిన 25 శాతం రాయితీ గడువు ఈనెల 30 వరకు ఉంది. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రశాంతి, టీపీఎస్, జనగామ పురపాలిక
ఈనెల 30తో ముగియనున్న
ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ..
వచ్చిన అప్లికేషన్లు 18,095.. ఆదాయం రూ.6.68కోట్లు
అండర్ ప్రాసెస్‌లో 1,979 దరఖాస్తులు

గడువు మూడురోజులే..