
ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్‌గా రాధాకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక మున్సిపాలిటీ నూతన కమి షనర్‌గా బండ్ల రాధాకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ కాజీపేట సర్కిల్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రవీందర్ ఇక్కడ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయి తే.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో చేపట్టిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణను పదోన్నతిపై ఘన్‌పూర్ మున్సి పల్ కమిషనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేకంగా పనిచేస్తానని, నూతనంగా ఏర్పడిన ఈ మున్సి పాలిటీ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆరు నెలల్లో మూడో కమిషనర్
ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఈ ఏడాది జనవరి 27న ఏర్పడింది. మొదటి కమిషనర్‌గా బాధ్యత లు స్వీకరించిన కృష్ణారెడ్డి వారం రోజుల అనంత రం హైదరాబా ద్‌కు బదిలీపై వెళ్లారు. కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రస్తుతం రాధాకృష్ణ పూర్తి స్థాయి కమిషనర్‌గా వచ్చారు.
నూతన కమిషనర్‌కు పలువురి సన్మానం
కమిషనర్ రాధాకృష్ణను కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అంతకు ముందు కమిషనర్.. కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆరు నెలల్లో మూడో కమిషనర్