
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
చిల్పూరు: రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం.. ఇందుకు తమ ప్రతీ అడుగు ఆ దిశగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్కాపూర్‌లో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం, చిన్నసెండ్యాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే రెడ్డి కమ్యూనిటీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ గత పాలకుల కారణంగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ఇక నుంచి ఏడాదిలో ప్రతిపక్షాల గొంతులు మూగబోయేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దేవునూరుగుట్టను ఎకో టూరిజంగా మారుస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో లెదర్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, పార్టీ నాయకులు సురేష్, యశ్వంతరెడ్డి, మల్లారెడ్డి, మామిడాల లింగా రెడ్డి, వెంకట్‌రెడ్డి, కె.పోషయ్య, జంగం రవి, రంజిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి