
రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం
లింగాలఘణపురం: రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ధ్యేయమని, కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసాను వారి ఖాతాల్లో జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని బండ్లగూడెం రైతువేదికలో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఏఓ రామారావునాయక్, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు 25లక్షల మందికి రూ.21వేలకోట్ల రుణమాఫీ, సన్నాలకు బోనస్ అందించామన్నారు. రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రతీహామీని అమలు చేసి ప్రజలకు మేలు చేయడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని, రైతుభరోసా అందజేసి రైతులకు పెట్టుబడిగా అందించిన సందర్భంగా నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 9 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓలు స్పందన, శ్రీనివాసు, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు దిలీప్‌రెడ్డి, నాగేందర్, గణపతి, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జిల్లాలోని రైతువేదికల్లో
సీఎంతో ముఖాముఖి