
నాణ్యమైన భోజనం అందించాలి
● ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్
రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎంఎస్‌ఎఫ్‌ల ఆధ్వర్యంలో మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లవకుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్‌లో మరమ్మతుకు నోచుకోని వాటర్ ప్యూరిఫయర్‌ను అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వర్షాకాలం నేపధ్యంలో పాఠశాలల ఆవరణలో గడ్డి తొలగించి శుభ్రం చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, పూర్తిస్థాయిలో పుస్తకాలు అందించాలన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఉదయ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్య, శివకృష్ణ, అరుణ్, సామరాజు తదితరులు ఉన్నారు.