
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా కేంద్రం స్థానిక ధర్మకంచలో జెడ్పీహెచ్‌ఓస్ బాయ్స్ హైస్కూల్‌లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డీఈఓ భోజన్న పాల్గొని మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో పోటీలు విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. డీడబ్ల్యూఓ ఫోరెన్స్, మంగళంపల్లి రాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రెడ్డి, ఎస్‌ఓ శ్రీనివాస్, సభ్యులు కౌశిక్, నల్ల రాహుల్ ప్రవీణ్, ఆసర్ల సుభాష్, నరసింహ, వెంపటి అజయ్, చిటుకుల అశోక్, దేశ్ పాండే సంస్థ ప్రతినిధులు చిన్న రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.