
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలం
జనగామ: వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఇప్పటికై న అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాద మృతు ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషి యా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
17 మంది మృతి బాధాకరం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి