
వారధికి ముప్పు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహావృక్షాలు
జనగామ ఫ్లై ఓవర్‌పై మహావృక్షాలు
● పగుళ్లు పడుతున్న బ్రిడ్జి
● కుంగిపోతున్న ఫుట్‌పాత్.. కూలిన మెట్లమార్గం
● ఆందోళనలో పట్టణ ప్రజలు
జనగామ: ప్రమాదాన్ని పక్కనే బెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఆర్‌అండ్‌బీ నాది కాదంటారు, ఎన్‌హెచ్ పట్టించుకోరు, పురపాలిక నాకేంటిలే అని వదిలేశారు. అందరూ కలిసి జనగామ ఫ్లై ఓవర్ ఆలనా పాలన గాలికి వదిలేస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా మారిపోతూ.. సిమెంట్ దిమ్మెల లోనకు చొచ్చుకు పోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనలో పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఐదు రాష్ట్రాలకు వారధిగా ఉన్న జనగామ జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి మూడు దశాబ్ధాలు గడిచి పోతుండగా, వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు, ప్రస్తుత మరమ్మతు గురించి అధికార యంత్రాంగం ఆలోచన చేయడం లేదు.
బ్రిడ్జికి ఇరువైపులా మహావృక్షాలు..
జనగామ జిల్లా కేంద్రం పాతబీటు బజారు నుంచి రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగించే వారు. ఐదు రాష్ట్రాలకు జనగామ ప్రధాన హైవే. నిత్యం రైళ్ల రాకపోకలతో గేటు మూసి వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో నాటి ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టింది. మూడు దశాబ్ధాల క్రితం ఫ్లై ఓవర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు భారీ వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం ఫ్లై ఓవర్ కు ఇరువైపులా రావి చెట్లు మహా వృక్షాలుగా పెరగడంతో పాటు బ్రిడ్జి రేలింగ్, మెట్ల మార్గం కూలిపోయి, ఫుట్‌పాత్ కుంగిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోననే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ఫుట్‌పాత్‌పై పూలకుండీలను ఏర్పాటు చేయడంతో పాదాచారులు నడవలేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై వెళుతున్నారు.
నిత్యం భారీ వాహనాలు
కాకినాడ పోర్టుతో పాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ప్రధాన హైవే కావడంతో నిత్యం వందలాది వాహనాలకు ఫ్లై ఓవర్ ఒక్కటే దిక్కు. ఆయా రాష్ట్రాల్లో ఇండస్ట్రీయల్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విశాఖపట్టణం, చైన్నె నుంచి మహారాష్ట్ర, గుజరాత్, అక్కడ నుంచి ఇటువైపుగా యంత్ర పరికరాలకు సంబంధించిన మెటీరియల్ తీసుకు వెళ్లే భారీ కంటైయినర్లు ఇటీవల కాలంలో పెరిగాయి. బ్రిడ్జి సామర్థ్యానికి మించి ఓవర్‌లోడ్‌తో ఇసుక, కంకర, ధాన్యం బస్తాలు, ఇతర వాహనాలు ప్రయాణం చేస్తుండడంతో దానిపై అధిక భారం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ పోర్టేషన్ జరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. జనగామ, చుట్టు పక్కల జిల్లాకు చెందిన అనేక మంది ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. వాహనాలతో బ్రిడ్జి ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది.
న్యూస్‌రీల్
గాలిలో దీపంలా..
ఫ్లై ఓవర్ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నిద్ర నుంచి మేలుకోవడం లేదు. 8 ఏళ్ల క్రితమే బ్రిడ్జి ప్రమాదంలో ఉందని అప్పటి ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హెచ్చరించిన పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. జనగామ ఫ్లై ఓవర్ పరిస్థితిని అంచనా వేసి... ప్రస్తుత అవసరాల మేరకు కొత్తగా నిర్మాణం చేస్తారా, లేక దీనికి రిపేర్లు చేసి సామర్థ్యం పెంచేలా ప్లాన్ చేస్తారా అంటూ ప్రజల సందేహాలను అధికారులు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మొదటగా బ్రిడ్జికి ఇరువైపులా పెరిగిన మహా వృక్షాలను తొలగించి, ప్రమాద నివారణను కొంతమేరకై న తగ్గించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

వారధికి ముప్పు

వారధికి ముప్పు

వారధికి ముప్పు