
సమర్థులకే పార్టీ పదవులు
రఘునాథపల్లి/కొడకండ్ల:కాంగ్రెస్ పార్టీలో సమర్థులకే పదవులు వస్తాయని పీసీసీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం జనగామ మండలం యశ్వంతాపూర్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేతలు వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకై నా దళితుడిని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల అమలుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాల ని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్ర పదవులు కావాలనుకునే వారు ఎమ్మెల్యే కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇరిగేషన్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందించడమే తన ఎజెండా అని పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే దేశ రక్షణ సాధ్యమని, నాడు ఇందిరాగాందీ ఫలితం సాధించాకే యుద్ధం ఆపినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్ను పాషా, రాష్ట్ర గంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్, ‘కూడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, పీసీసీ పరిశీలకులు లింగంయాదవ్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దయాకర్ మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం ఉంది.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.. అదే బాట లో పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా పాలకుర్తి కోడలుగా మాట ఇస్తున్నాను.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులను తన హాయంలోనే పూర్తి చేయిస్తానని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదే అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్