
నిరసన కార్యక్రమంలో ప్రవీణ్, తదితరులు
జనగామ: రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదాని, ప్రధాని మోదీ మధ్య ఉన్న చీకటి స్నేహం బయటపడుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీపై అనర్హవేటు వేశారని, దీనిని ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా పరిగణిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పులి గణేష్‌గౌడ్, నా యకులు అల్లం ప్రదీప్‌రెడ్డి, కొన్నె మహేందర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, ఈర్ల లక్ష్మణ్, శ్రీనివాస్‌యాదవ్, కృష్ణస్వామి, పట్టూరి శ్రీనివాస్, రంగు రవి, మాజీద్, పిట్టల సతీస్, వెంకటేశ్‌యాదవ్, తిరుపతి, శేఖర్‌గౌడ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.