
దుబ్బరాజన్న ఆలయానికి రెనోవేషన్ కమిటీ
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి దేవాదాయశాఖ 11 మంది సభ్యులతో రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కోండ్ర రాంచంద్రారెడ్డి, వాసం శ్రీనివాస్, కొలపాక రవి, పంగ కిష్టయ్య, పిన్నం సత్యనారాయణ, మానుక గంగమ్మ, రంగు శంకర్, మతులాపురం శంకర్, చెట్ల శేఖర్, సూర సత్యనారాయణరెడ్డి, ఉరుమడ్ల పోశాలు నియమితులయ్యారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ నియామకానికి కృషిచేసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.