
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యల ను తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరి ష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు
● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని అదనపు కలెక్టర్ లత అన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 23,400 కొత్త రేషన్‌కార్డులు, 46,884 మందిని కార్డుల్లో నమోదు చేశామని తెలిపారు. రేషన్‌కార్డు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 592 దుకాణాల ద్వారా మూడునెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్‌లో 6,437 ఏసీకేలు బకాయిలు ఉండగా.. రైస్‌మిల్లర్స్‌తో సమీక్షించి 14,481 ఏసీకేలు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. ధాన్యం దిగుబడి గతంలో కంటే 50వేల టన్నులు అదనంగా వచ్చిందని, రైస్‌మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి వారి అకౌంట్లలో జమ చేశామన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అక్రమ నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సోమవారం సమావేశమైంది. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని సూచించారు. అట్రాసిటీ బాధితులకు నిధులు మంజూరు చేస్తున్నామని, అదేస్థాయిలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నా రు. అట్రాసిటీ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.2కోట్ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మా ట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారని, మంత్రి సహకారంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎీస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యమకారులను గుర్తించాలని దీక్ష
జగిత్యాలటౌన్: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ జవ్వాజి శంకర్ కోరారు. ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట శాంతియుత దీక్ష చేపట్టారు. వీరికి ఉద్యమ జేఏసీ నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్‌శర్మ మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం కవులు, కళాకారులు, ఉద్యమకారులు అహర్నిశలు కృషి చేశారని, వారి అండతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. జవ్వాజి శంకర్ మాట్లాడుతూ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. 250 చదరపు గజాల స్థలం, 25వేల పెన్షన్, హెల్త్‌కార్డులు అందించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగుల రాజు, ప్రధాన కార్యదర్శి భారతపు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొలాస పరిశోధన స్థానం డైరెక్టర్‌గా హరీశ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌గా హరీశ్‌కుమార్ శర్మ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన శ్రీలతను యాదాద్రిభువనగిరి డాట్ సెంటర్‌కు బదిలీ చేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న సైదానాయక్‌ను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు బదిలీ చేశారు. పరిశోధన స్థానంలో పనిచేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.

బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం