
ప్రజల భాగస్వామ్యంతోనే ‘మత్తు’ నిర్మూలన
జగిత్యాలటౌన్: ప్రజల భాగస్వామ్యంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి మినీస్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలై భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దన్నారు. చెడు అలవాట్లను దూరం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తు నివారణకు యువత ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు బానిస కావద్దన్నారు. మత్తుతో కలిగే పరిణామాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పోలీస్ కళాబృందాలతో ప్రచారం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి నరేశ్, డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ
హాజరైన ఎస్పీ అశోక్‌కుమార్