
పేదల కలలను సాకారం చేస్తున్నాం
పెగడపల్లి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి లబ్ధిదారులకు అందించారు. గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రైతు భరోసా కింద తొమ్మిదిరోజుల్లో రూ.9వేల కోట్లు అందించామన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. కాళేశ్వరం లింక్ ప్రాజెక్టు పైపులైన్ నుంచి సాగునీరు అందించేలా చర్యలు చేపడుతామన్నారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల లబ్ధిదారులకు నాలుగా దఫాలుగా రూ.5 లక్షలను ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఏవో భాస్కర్, డీఆర్డీవో రఘువరన్, మండల ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌రావు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి రైతులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్