
మాదక ద్రవ్యాలను నిరోధించాలి
● వ్యతిరేక వారోత్సవాలు విజయ వంతం చేయాలి ● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని మహిళ సంక్షేమశాఖ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 21న క్రీడలపోటీలు, యోగా డే, జిల్లాస్థాయి డ్రగ్ ఫ్రీ క్రీడలు, 22న అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 23న మొక్కలు నాటే కార్యక్రమం, 24న డిజిటల్ ఎంగేజ్‌మెంట్ సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. 25న పోస్టర్లు, కళాప్రదర్శనల పోటీలు నిర్వహించాలని, 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేడుకల ర్యాలీ, స్లోగన్స్, సంతకాల సేకరణ, స్టాల్స్, ఫొటో ప్రదర్శన, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరేశ్, డీఎంహెచ్‌వో ప్రమోద్, సునీల్‌కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మంజూల, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బెస్ట్ అవైలేబుల్ స్కూళ్ల లక్కీడ్రా
2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో గల బెస్ట్‌అవైలేబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 93 మంది దరఖాస్తు చేసుకోగా, 75 మందిని తీసుకోవడం జరిగిందని, 5వ తరగతిలో 120 మంది దరఖాస్తు చేసుకోగా, 76 సీట్లు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌కులాల అధికారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.