
తిరోగమనంలో తెలంగాణ
మల్లాపూర్: మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలం గొర్రెపల్లిలో శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అమలైన పథకాల్లో కోతపెడుతూ ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. 18నెలల పాలనతోనే తెలంగాణ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిలబడి కొట్లాడుతానని, విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనకు పనిచేస్తానన్నారు. గ్రామాల్లో పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిందని, ఒక్క రూపాయి ఇవ్వొద్దన్నారు. అనంతరం మొగిలిపేటలో రూ.5లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, పీఆర్ డీఈ వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతా
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్