
పశువుల మందుల్లేవ్..
రాయికల్: సహజంగానే వర్షకాలంలో గొర్రెలు, మేకలు వివిధ వ్యాధుల బారిన పడతాయి. వాటిని కాపాడుకునేందుకు పెంపకందారులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ప్రభుత్వమే పశువుల మందులను అందించాల్సి ఉంటుంది. అయితే కనీసం నట్టల నివారణ మందును కూడా ప్రభుత్వం నుంచి పంపిణీ కాలేదు. ఏడు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి మందులు లేకపోవడంతో పెంపకందారులు ప్రైవేటు మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్షకాలంలో పశువుల్లో చిటుకు రోగం, నీలి నాలుక, ఫూట్రాట్ వ్యాధి, గా లికుంటు, కుంటుపట్టడం వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే మందులు ఏ డు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా నట్టల నివారణ మందుల కోసం ప్రై వేటు దుకాణాలను ఆశ్రయించి వేలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలినా లుక నియంత్రణకు వేసే బ్లూటంగ్, హెచ్‌ఎఫ్ డీ క్యూ, గొంతువాపు టీకాలు, పీపీఆర్, ఎల్‌ఎఫ్‌జీ వంటి వ్యాక్సిన్లు సరైన సమయంలో సరఫరా కా కపోవడం గమనార్హం. సరఫరా అయిన వ్యాక్సి న్లు కూడా సంబంధిత వైద్యాధికారులు బయట విక్రయిస్తూ అందినంతా దోచుకుంటున్నారు.
ఏడు నెలలుగా సరఫరా కాని మందులు
ప్రతి నాలుగు నెలలకోసారి పాడి రైతులకు ప్రభుత్వం మందులను సరఫరా చేయాల్సి ఉండగా.. ఏడు నెలల నుంచి మందులు రావడం లేదు. గొర్రెలు, మేకల కోసం ప్రభుత్వం నట్టల నివారణ మందు, జ్వరం, నీలినాలుక, యాంటిబయటిక్స్, వ్యాక్సిన్లు సరఫరా చేసే అవకాశం ఉంది. పాడి గేదెలకు లంపిస్కిన్ కోసం ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాల్సి ఉండగా గతంలో సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో చాలా ఆవులు, గేదెల్లో ఈ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఇప్పటివరకు బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో పశువైద్య ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు. రిజిస్టర్ లేకపోవడంతో పశువైద్యాధికారులు తమ జేబులోంచి ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షకాలం పూర్తయ్యేలోపు పశువులకు సంబంధించిన మందులను సరఫరా చేయాలని, సకాలంలో వ్యాక్సిన్లు వేయాలని కోరారు.
జిల్లాలో పశువులు
2,74,934 గొర్రెలు, మేకలు
50,753 గేదెలు
19,000 ఆవులు
సరఫరా కాని నట్టల నివారణ మందులు
ఏడు నెలలుగా నిలిచిపోయిన వైనం
ప్రైవేటు దుకాణాల్లోనే కొనుగోలు
నష్టపోతున్న పశువుల పెంపకందారులు

పశువుల మందుల్లేవ్..