
ఎన్నికలొస్తున్నాయనే రైతుభరోసా
కోరుట్ల: ఎన్నికలొస్తున్నాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా విడుదల చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు రైతుభరోసా ఇచ్చారని పేర్కొన్నారు. సీఎంకు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులపైనా అవగాహన లేదన్నారు. ఎంపీ అర్వింద్ బనకచర్లను జనకచర్ల అనడం ఆయనకున్న పరిజ్ఞానానికి అద్దం పడుతోందన్నారు. ప్రజలకు అన్ని విషయాల్లో మేలు చేసింది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న కోరుట్ల యువతకు ఉపాధి కల్పన కోసం కటుకం సంగయ్య ఫంక్షన్‌హాల్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, చీటి వెంకట్రావ్, కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతిక్, వంతడుపుల అంజయ్య, మోహన్‌రెడ్డి, రాజమురళి, సురేందర్‌లు పాల్గొన్నారు.