
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ● సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 59 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.