
కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు
కోరుట్లటౌన్: స్వేచ్ఛ సాహిత్య, సామాజిక సేవా సంస్థఽ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ గ్రంథాలయ ఆవరణలో సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాస భూమయ్య, కవి వోటారి చిన్న రాజన్న అధ్యక్షతన 40 మంది కవులు ఉగాది కవితలు, పాటలతో ఆకట్టుకున్నారు. ప్రతీ వ్యక్తిలో దాగివున్న ప్రతిభను వెలికితీసి కవులు, రచయితలుగా ప్రోత్సాహం అందిస్తున్న స్వేచ్ఛ సంస్థ పనితీరు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కవులు చెన్న విశ్వనాథం, రావికంటి పవన్, కట్కం కవిత, సుతారి గంగమణి, వోటారి రమాదేవి, కటుకోజ్వల మనోహరాచారి, నేరెళ్ల రామకృష్ణ శాస్త్రి, రుద్ర మాణిక్యం, రుద్ర నాగరాజు, గోలి దిలీప్, పోతుగంటి వెంకటేశ్వర్లు, రాజోజి భూమేశ్వర్, రాపెల్లి రాజగంగారాం, రాజబత్తుల రాజశేఖర్, వోటారి శ్రీనివాస్, భూపెల్లి నాగేశ్వర్‌రావు, నాంతాబాద్ రవి, ఆర్మూర్ శ్యాం, లింబాద్రి, చిలుక రాజలింగం, ఆడెపు శిరీష్, ఆదామ్, రూప్‌సింగ్, బి.భూమేశ్, కల్యాణచారి, గ్రంథాలయ సభ్యులు, పాఠకులు పాల్గొన్నారు.