
పురస్కారం అందుకుంటున్న గంగాధర్
ధర్మపురి: తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్తంభంకాడి గంగాధర్ 2023 కిగాను ఉగాది పురస్కారం అందుకున్నారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన అనేక కవితలు రాశారు. ఆ యన సేవలు గుర్తించిన బెంగళూరులోని క ర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం పురస్కారం అందజేశా రు. ఆయన రచించిన ‘అమృతతల్పం’ వచ న కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా గంగాధర్ పురస్కారం అందుకున్నా రు. ఆయనను పలువురు అభినందించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
జగిత్యాల: రెండు రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నీటినిల్వలు, ఆహారం కలుషితమయ్యే ప్రమా దం ఉందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో శ్రీధర్ సోమవారం సూచించారు. కలుషిత నీరు, ఆహారంతో టైఫాయిడ్, కామె ర్లు, రక్త విరేచనలు, డయేరియా, కలరా సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం హెచ్3ఎన్ 2 ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.