
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు
● కలెక్టర్‌కు ఉద్యోగ సంఘం నాయకుల వినతి
జగిత్యాల: తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యోగ సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమగ్ర శిక్షలో కేజీబీవీ, యూఆర్‌ఎస్, బోధనేతర సిబ్బంది, వివిధ హోదాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారని, విద్యాశాఖలో కీలకంగా ఉంటూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడంతో పాటు ప్రతి ఉద్యోగికి జీవిత భీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.5 లక్షలు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి రవి, షారూక్, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.