
నువ్వుల పంటను పరిశీలిస్తున్న గోపాల్‌రెడ్డి, నాయకులు
● బీజేపీ కిసాన్‌మోర్చా
జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి
కథలాపూర్(వేములవాడ): వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.20 వేల పరిహారం ఇచ్చి, రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కథలాపూర్ మండలంలోని కలిగోట శివారులో వర్షంతో నష్టపోయిన నువ్వుల పంటను పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి నేలవాలి, రైతన్నలకు నష్టం వాటిలిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం రాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర సర్కారు స్పందించి, పంటలపై అధికారులతో సర్వే చేయించి, పరిహారం త్వరగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరెడ్ల రవీందర్‌రెడ్డి, నాయకులు అల్లూరి బాపురెడ్డి, జలంధర్, మణికంఠ, రాంసింగ్, గంగారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.