● టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ● చైర్మన్ ఇంకా కుర్చీని పట్టుకు వేలాడటం సిగ్గుచేటని విమర్శ
జగిత్యాలటౌన్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీ వన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు క్షోభకు గురవుతున్నారని అ న్నారు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి ఇంకా కుర్చీని పట్టుకు వేలాడటం సిగ్గుచేటని విమర్శించారు. కాన్ఫిడెన్షియ ల్ గదిలోకి ఇతరులు వెళ్లడం చైర్మన్ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా ఉన్నప్పుడే ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో దాదాపు 30 మంది విద్యార్థులు బలయ్యారని, అలాంటి వ్యక్తిని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. నిరుద్యోగుల్లో విశ్వాసం నింపాల్సిన బాధ్యత సీఎం కేసీ ఆర్‌పై ఉందని, క్వాలీఫై అయిన ప్రతీ అభ్యర్థికి రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశా రు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా ఎంతో చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. వాస్తవాలు మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నామనడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రసార సాధనాల స్వే చ్ఛను హరించడం సరికాదన్నారు. నాయకులు గిరి నాగభూషణం, గాజుల రాజేందర్, కొత్త మోహన్, బండ శంకర్, మన్సూర్, మధు తదితరులున్నారు.