
నిరసన తెలుపుతున్న మహిళలు
జగిత్యాలటౌన్: ప్రభుత్వం ఇటీవల మహిళా సంఘాలకు విడుదల చేసిన పావలా వడ్డీ రుణాలు తమకు రాలేదని జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌కు చెందిన మహిళలు అన్నారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. టీఆర్‌నగర్‌లో 40 మహిళా సంఘాలున్నాయని అధికారులను సంప్రదించగా టీఆర్‌నగర్ జగిత్యాల పట్టణ పరిధిలోకి రాదని చెప్పారన్నారు. పట్టణ మహిళా సంఘాలకు మాత్రమే పావలా వడ్డీ రుణాలు విడుదలయ్యాయని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.