
సమావేశంలో మల్లేశం, నాయకలు
సారంగాపూర్(జగిత్యాల): ప్రభుత్వ పథకాలను మాలలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం అన్నారు. సోమవారం బీర్‌పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేదిక మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలలు ఐక్యంగా ఉండాలని, ఉన్నత చదవులు చదివాలని చెప్పారు. చట్టాలను గౌరవించి, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా అధ్యక్షుడు సూరమల్ల సతీశ్, రాష్ట్ర ముఖ్య సలహాదారు బొల్లం విజయ్, రాష్ట్ర కోశాధికారి గుమ్మడి శ్రీనివాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొప్పుల వెంకటరమణ, కమ్మునూర్, కొల్వాయి గ్రామాల సర్పంచ్‌లు బందెల మరియ, మేసు ఏసుదాసు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి, నాయకులు పాల్గొన్నారు. బీర్‌పూర్ మండలశాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా బేర అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఉయ్యాల కిషన్, గౌరవ అధ్యక్షుడిగా బందెల వెంకటేశ్ తదితరులు నియమితులయ్యారు.