
మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి
● జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి
మెట్‌పల్లి(కోరుట్ల): ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. సాధారణ ప్రసవాల వల్ల జరిగే ప్రయోజనాలు, సిజేరియన్ల వల్ల కలిగే నష్టాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అత్యవసర కేసులైతే తప్ప సిజేరియన్ చేయవద్దన్నారు. అంతకుముందు పలు రికార్డులను పరిశీలించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వి వరాలు, 102 రూట్ మ్యాప్, కేసీఆర్ కిట్ల వివరా ల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సాజిద్ అహ్మద్, వై ద్యులు సబిత, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.