
ఇసుక రీచ్‌లలో లారీలు నడపలేం
ప్రత్తిపాడు: అధికారుల వేధింపులు తాళలేమని, ఇసుక రీచ్‌లలో లారీలు నడపలేమని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గుంటూరు అమరావతి రోడ్‌లోని హోసన్నా మందిరం సమీపంలో లారీలను నిలిపివేసి జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ అధికారులు ఓవర్ టన్నేజీ తోలేందుకు అభ్యంతరం తెలుపుతున్నారని, అందుకు సమ్మతమేనని, కానీ దీనివల్ల వినియోగదారుడికి రూ.700కే ఇసుక అందించగలమని పేర్కొన్నారు. గతంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, అందుకు అంగీకరించారని చెప్పారు. ఇప్పుడు ఆర్టీవో అధికారులు జరిమానా విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లారీలకు ఈఎంఐలు కట్టలేక, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక ఇసుక లారీలను ఆపివేసినట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 40 టన్నులు ఇసుక ఎత్తి 20 టన్నులకే బిల్లులు ఇస్తున్నారని, ఆర్టీవో అధికారులు వాహనాలను నిలిపి ఓవర్ టన్నేజీ కింద రూ. 50 వేలు ఫైన్ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులో లారీ ఓనర్లు, డ్రైవర్లు ధర్నా