
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన శ్యామ్ సునీల్ కొల్లూరులో రేషన్ బియ్యాన్ని ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకొని రాత్రి సమయంలో తరలించటానికి ప్రయత్నించాడు. సుమారు 76 బస్తాల రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరు మండలంలోని రైస్ మిల్లుకు తరలించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని వివిధ కంపెనీలకు చెందిన గోతాలలో ప్యాక్ చేసి ఆటోలో తరలించే యత్నం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన శ్యాం సునీల్, బుల్లెద్దు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.