
గుంటూరు
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
కూటమి మోసాలపై
పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
నరసరావుపేట: క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ పంటల బీమా పథకం పోస్టర్లను కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆవిష్కరించారు.
శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం
నగరం: జిల్లేపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు.
సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం
తెనాలి అర్బన్: సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్స బుధవారం ఐతానగర్‌లోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గేరా థామస్, సీయోను కుమారిలు జెండా ఎగురవేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ప్రథమం కాదని తెలిపారు. 1999 నుంచి ఆయన పొత్తులతో గెలిచి ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి, గెలిచిన తరువాత ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తామంటూ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లు హామీ ఇచ్చారని, అమలు చేసే సమయానికి మాట దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమని సూచించారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సుపరిపాలన గురించి, చంద్రబాబు ఇప్పుడు వైద్యరంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో వివరించాలని చెప్పారు. పెన్షన్లు పెంచామని చెప్పి ఎంతమందికి అందడం లేదనేది కూడా వివరించాలని పేర్కొన్నారు.
– వై.వి. సుబ్బారెడ్డి ,
వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్
తాడేపల్లి రూరల్: ‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మరొకసారి వంచించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు కూటమి మోసాన్ని, దగాను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి’’నట్లు వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్‌లోని కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో గుంటూరు, పల్నాడు జిల్లాల వైఎస్సార్‌సీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్‌రెడ్డి, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భాస్కర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు, తెనాలి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు,పల్నాడు జిల్లాల వైస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వై.వి. సుబ్బారెడ్డి , వేదికపై పార్టీ నేతలు
7
సెల్‌ఫోనే ఆయుధం
న్యూస్‌రీల్
1999 నుంచి హామీలు ఇవ్వడం..
మరవడం బాబుకు మామూలే !
వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాలను
ప్రజలకు వివరించాలి
టీడీపీ ఇవ్వని వాటిని ఇంటింటికీ
వెళ్లి వివరించాలి
వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్,
రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు