
రాజధాని రైతుల సమస్యలపై అలసత్వం వద్దు
తాడికొండ: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ అధికారులకు సూచించారు. రాజధానిలో రైతులు, రైతు కూలీల పరిష్కారం కోసం తుళ్లూరు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు, రిటర్నబుల్ ప్లాట్లు, వీధిపోటు సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొత్తం 27 ఫిర్యాదులు అందాయని, వాటిలో భూ వ్యవహారాలు– 17, ఇన్‌ఫ్రా–3, సామాజిక సంక్షేమం –3 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి. శ్రీనివాస నాయక్, ఎం. శేషిరెడ్డి, కె.ఎస్. భాగ్యరేఖ, పి. పద్మావతి, ఏజీ చిన్నికృష్ణ, కె. స్వర్ణ మేరి, జి.రవీందర్, జి.భీమారావు, సీఆర్డీయే సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి. పాండురంగారావు, రామకృష్ణన్, సామాజిక సంక్షేమ విభాగ డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ 27 ఫిర్యాదులు అందజేసిన రాజధాని రైతులు