చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం | - | Sakshi
Sakshi News home page

చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం

Dec 1 2025 9:24 AM | Updated on Dec 1 2025 9:24 AM

చీకటి

చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం

అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం

జిల్లాలో వ్యాధి నియంత్రణ దిశగా చర్యలు సఫలీకృతం

పెదవేగి: ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. గతంలో జిల్లా జనాభాలో 3.5 శాతంగా ఉన్న హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం 0.1 శాతం కంటే తక్కువకు చేరుకోవడం వెలుగు వైపు పయనంగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 8745 మంది బాధితున్నారు. వీరిలో అధికశాతం యాంటీ రెట్రో వైరస్‌ థెరపీ(ఏఆర్‌టీ) మందులను వాడుతున్నారు. వైద్యం పొందుతున్న వారిలో 3511 మంది పురుషులు కాగా.. 4952 మంది మహిళలు ఉన్నారు. 21 మంది ట్రాన్స్‌జెండర్స్‌, 261 మంది చిన్నారులు ఏఆర్‌టీ మందులను తీసుకుంటున్నారు. వీరికి ఏఆర్‌టీ మందులను ఇవ్వడంతోపాటు, వాటిని వాడుతున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్‌లు, చింతలపూడి, భీమడోలు, నూజివీడు, కొయ్యలగూడెం, కై కలూరులో లింక్‌ ఏఆర్‌టీ సెంటర్‌లు పనిచేస్తున్నాయి.

ముందస్తు నియంత్రణ చర్యలు

కీలకం

హెచ్‌ఐవీని నివారించాలంటే అసురక్షిత లైంగిక పద్ధతులను అరికట్టాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరిస్క్‌గా గుర్తించిన ఫీమెల్‌ సెక్స్‌ వర్కర్‌లు, కొందరు ఎల్జీబీటీ కమ్యూనిటీ వారికి తరచూ సుఖవ్యాధుల పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిఫిలిస్‌, హెచ్‌ఐవీ టెస్టులు చేయడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పులను తీసుకొచ్చేందుకు ఎన్జీవోల ద్వారా పర్యవేక్షణ కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా లెప్రా ఇండియా ఆధ్వర్యంలో 35 పౌష్టికాహార కిట్‌లు దిశ బృందం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ వ్యాధి బాధితులకు ఆదివారం అందించారు.

అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నెలా ఒక యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం ఏ రోజుల్లో ఏ సిబ్బందిని ఏ ప్రాంతాలకు పంపించాలో ప్రణాఽళికతో సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు నెలవారీ నివేదికలు పరిశీలిస్తూ , ఇంకా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

డాక్టర్‌ లక్ష్మీనారాయణ డీఎల్‌ఏటీఓ, ఏలూరు జిల్లా

చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం 1
1/1

చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement