క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ లెక్కింపు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి హుండీ లెక్కించగా రూ.32,64,772 ఆదాయం వచ్చింది. శనివారం దేవదాయ శాఖ భీమవరం డివిజన్ అధికారి వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఎంఈవో రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ ద్వారకాతిరుమల చినవెంకన్నను వేలాది మంది భక్తులు శనివారం దర్శించారు. దాంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. దర్శనం క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు. దాంతో ప్రసాద వితరణ క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, అనివేటి మండపం, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి.
క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ లెక్కింపు


