రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు
పాలకోడేరు: గ్రామీణ యువత క్రీడల్లో సత్తా చాటేందుకు స్కూల్ గేమ్స్ పోటీలు ఎంతగానే ఉపయోగపడతాయని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి తెలిపారు. శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ అండర్–14 బాలుర, బాలికల పోటీలను గురువారం డీఈఓ నారాయణతో కలసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగేలీ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 390 మంది క్రీడాకారులు తరలిరాగా తొలిరోజు లీగ్ మ్యాచ్‌లు ఉత్సామంగా సాగాయి. 29న ఫైనల్ పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ పరిశీలకులు కల్పన తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 హరిఆనందప్రసాద్, ఎస్‌ఎఫ్ కార్యదర్శి పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.


