
తాగిస్తాం.. తూలిస్తాం
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా మారింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగడంతో పాటు వీధివీధినా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏలూరులో మద్యం మత్తులో యువత జోగుతోంది. మందుబాబులు ఫూటుగా మద్యం సేవించి ఎక్కడపడి తే అక్కడ దొర్లుతున్నారు. నగరంలో పదుల సంఖ్య లో మద్యం షాపులు వీటికి తోడు అనధికారంగా నిర్వహించే బెల్టు షాపుల్లో ఎనీ టైమ్ మందు అందుబాటులో ఉంటోంది. ఫుల్‌గా మద్యం తాగిన మందుబాబులు ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపై, షాపుల మెట్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో, పార్కుల్లో మద్యం మత్తులో పడి దొర్లుతున్నారు.
గత ప్రభుత్వంలో సమయం మేరకే..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. దీంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలు జరిపేవారు. అలాగే బెల్టుషాపులకు పక్కాగా అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వ షాపుల్లో మాత్రమే విక్రయా లు జరపడం, అక్కడ సిట్టింగులు లేకపోవడం, బెల్టుషాపులు ఉండకపోవడంతో యథేచ్ఛగా అమ్మకాలు జరిగేవి కాదు. దీంతో మందుబాబులు ఫుల్‌గా మద్యం తాగి రోడ్లపై దొర్లే దృశ్యాలు కనిపించేవి కావు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
సందు సందునా..
కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ షాపులకు అనుబంధంగా అనధికారికంగా బెల్టుషాపులు వెలిశా యి. బెల్టుషాపులను అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మద్యం, బెల్టుషాపులు అధికార పార్టీ నాయకులు, అనుచరులవి కావడంతో అధికారులు అటుగా కన్నె త్తి చూడటం లేదు. నామమాత్రపు దాడులతో సరి పెడుతున్నారు. ఏలూరులో గుడి, బడి తేడా లేకుండా బెల్టుషా పులు నిర్వహిస్తుండటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
విచ్చలవిడిగా అమ్మకాలు
ఏలూరు నగరం పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు, బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేపట్టినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు సైతం వీటికి వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేశాం. ఓపక్క మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి యథేచ్చగా మద్యం అమ్మకాలు కారణంగా కనిపిస్తోంది. తక్షణమే విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలి.
– ఎ.రాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, ఏలూరు
●
ఇంటింటా మద్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటా విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందేవి. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటింటా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త ఇళ్లల్లో మద్యం ఫుల్‌గా లభిస్తోందంటే అతిశయోక్తి లేదు. ఇంటింటా రేషన్ సరుకులను అందించే వాహనాల్లో ఇప్పుడు మద్యం సరఫరా చేయడం సిగ్గుచేటు.
– జుజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు, ఏలూరు
మద్యం ఏరులు.. బెల్ట్ బారులు
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
వేళాపాళా లేకుండా విక్రయాలు
ఏలూరులో వీధివీధినా బెల్టు షాపులు
మద్యం మత్తులో జోగుతున్న యువత
కూటమి ప్రభుత్వంలో ‘ఎనీ టైమ్ మందు’
యువత పెడదోవ
యథేచ్ఛగా విక్రయాలతో నగరంలోని యువత మద్యానికి బానిసవుతున్నారనే ఆందోళన వ్యక్త మవుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని మహిళా సంఘాలు అంటున్నాయి. గతంలో రోడ్డుకు 200 మీటర్ల దూరంలో మద్యం షాపును నిర్వహించే వారు. కూటమి ప్రభుత్వంలో ఈ నిబంధన లేకపోవడంతో రోడ్లను ఆనుకుని దుకాణాలు ఏర్పాటుచేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనచోదకులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.

తాగిస్తాం.. తూలిస్తాం

తాగిస్తాం.. తూలిస్తాం

తాగిస్తాం.. తూలిస్తాం