
పిచ్చికుక్క స్వైరవిహారం
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం తా టాకులగూడెంలో పిచ్చికుక్క 9 మందిపై దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారంఆదివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ పిచ్చికుక్క గ్రామంలో స్వైరవిహారం చేస్తూ 9 మందిని గాయపర్చింది. దీంతో గ్రామస్తులు దానిని హతమార్చారు. ఎస్.భద్రమ్మ, ఎస్.నాగేశ్వరమ్మ, పి.కవలమ్మ, కె.రాణి, ఎం.దావీదుతోపాటు మరో నలు గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జీలుగుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించడంతోపాటు వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూటీ దగ్ధం
ఏలూరు టౌన్: జిల్లాలోని 16వ నంబర్ జా తీయ రహదారిపై వెళుతున్న స్కూటీ దగ్ధమైంది. పెదవేగి మండలం అమ్మపాలేనికి చెందిన మెడంకి ఏసుపాదం కుమారుడు, స్నేహితుడు కలిసి ఏలూరు వెళుతుండగా చుట్టుగుంట బ్రిడ్జి సమీపంలో స్కూటీ నుంచి పొగలు రావడంతో వారు అక్కడే నిలిపివేశారు. అనంతరం మంట లు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు గల కారణాలపై స్పష్టత లేదు. స్కూటీని 2021లో కొనుగోలు చేసినట్టు తెలిసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఎస్సై కుటుంబానికి చేయూత
నరసాపురం : తూర్పుగోదావరి జిల్లా ఆలమూ రు ఎస్సైగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్సై ఎం.అశోక్ కుటుంబానికి సహచర పోలీసు అధికారులు అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009 బ్యాచ్‌కు చెందిన 1,100 మంది సీఐలు, ఎస్సైలు 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రూ.26 లక్షలు సేకరించారు. సోమవారం నరసాపురంలోని అశోక్ ఇంటి వద్ద జరిగిన సంతాప కార్యక్రమంలో ఈ మొత్తాన్ని ఆయన కుటుంబానికి అందించారు. తర్వాత ఆలమూరు వెళ్లి ఎస్సైతో పాటు మృతి చెందిన కానిస్టేబుల్ బ్లెన్సన్ జీవన్ కుటుంబానికి రూ.5 లక్షలు అందించారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి మాట్లాడుతూ 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎలాంటి ఆపద వచ్చినా స్పందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ రూ.2 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించినట్టు చెప్పారు.
ఉరకలేస్తున్న గోదావరి
పెనుగొండ/నరసాపురం : వశిష్టా గోదావరి వరద నీటితో ఉరకలేస్తోంది. రెండు రోజు లుగా గోదావరిలోకి ఎర్రనీరు వచ్చి చేరుతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చినమల్లం, పెదమల్లం, కోడేరు, భీమలాపురం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. సిద్ధాంతంలో మధ్య లంకను నీరు తాకింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, పుచ్చల్లంక వద్ద పల్లపు ప్రాంతాలకు నెమ్మదిగా నీరు చేరుతోంది. రైతులు రాకపోకలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
నరసాపురంలో..
నరసాపురం: నరసాపురంలోని వశిష్ట గోదావరిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. వలంధర్ రేవు వద్ద పరవళ్లు తొక్కుతూ గోదావరిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. గోదావరి క్రమేపీ ఎర్ర రంగులోకి మారుతోంది.

పిచ్చికుక్క స్వైరవిహారం

పిచ్చికుక్క స్వైరవిహారం

పిచ్చికుక్క స్వైరవిహారం