
జగన్నాథ..మోక్షప్రదాత
జై జగన్నాథ.. జయహో జగన్నాథ స్మరణలు మార్మోగాయి. ఆదివారం మండలంలోని లక్ష్మీపురం, తిమ్మాపురం గ్రామాల్లో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాల ముగింపును పురస్కరించుకుని రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర, జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చూసి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. రథం లక్ష్మీపురం నుంచి తిమ్మాపురం వరకూ వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఆలయ డీఈఓ వై.భద్రాజీ పర్యవేక్షించారు.
– ద్వారకాతిరుమల

జగన్నాథ..మోక్షప్రదాత