
జగన్ 2.0 లో కార్యకర్తలదే పాలన
కొయ్యలగూడెం: జగన్‌మోహన్‌రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలే పాలకులు అని, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారానే కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కారుమూరి సునీల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజుతో కలసి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి నిశితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో గెలుచుకోబోయే మొట్టమొదటి స్థానం పోలవరం అని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి రక్షణ కార్యకర్తలు అని జెట్టి గురునాథరావు పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా మారిందని, పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి తారాస్థాయిలో ఉందన్నారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ కంచుకోటగా మలుస్తూ విజయరాజు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజు, అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఎంపీపీలు సుంకర వెంకటరెడ్డి, గంజిమాల రామారావు, చందా ప్రసాద్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, కెఎస్‌ఎస్ శ్రీను రాజు, బుగ్గ మురళి, అల్లూరి రత్నాజీ, తాండ్రు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.