తండ్రిపై దాడి
శ్రీరంగరాజపురం: తండ్రిపై కొడుకు దాడిచేసి గాయపరిచిన ఘటన మండలంలోని పిల్లారికుప్పంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం. పిల్లారికుప్పం గ్రామానికి చెందిన చెంగారెడ్డి కుమారుడు కమలేష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. మద్యానికి బానిసై నిత్యం తన తండ్రి, బంధువులు, గ్రామస్తులతో గొడవపడేవాడు. ఇటీవల గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి అతనికి రావాల్సిన ఆస్తిని కూడా పంచి ఇచ్చారు. ఆదివారం యథాప్రకారం మద్యం కోసం తండ్రిపై గొడవ పడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో చెంగారెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన చెంగారెడ్డిని స్థానికులు 108 సాయంతో చిత్తూరు ప్రభూత్వాస్పత్రికి తరలించారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కంటి వైద్యురాలి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం ) : చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కంటి వైద్యురాలు డాక్టర్ సుధా ఆదివారం మృతి చెందారు. ఉదయం సొమ్మసిళ్లి పడిపోయారు. ఈ విషయం గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఆర్‌ఎం సంధ్య, ఆస్పత్రి బృందం కంటతడి పెట్టారు.


