
● సగం సంపాదన ఇంటి అద్దెకే! ● పట్టణాల్లోనే కాదు పల్లెల్ల
పలమనేరు: పట్టణ సమీపంలోని సాయినగర్‌కు చెంది న జ్యోతి కుటుంబం ఓ అద్దె ఇంట్లో కాపురముంటోంది. ఆమె ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తూ నెల జీతం రూ.10 వేలతో తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఇందులో ఇంటి అద్దెకు రూ.6 వేలు, విద్యుత్ బిల్లుకు రూ.550 మొ త్తం కలిపి రూ.6,550 అవుతోంది. మిగిలిన సగం సంపాదనలో పిల్లల చదువులు, ఇంటి సామగ్రి, ఆస్పత్రి ఖర్చులు తదితరాలకు సైతం ప్రతి నెలా అప్పులు చే యాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి యజమాని అద్దె పెంచినప్పుడల్లా ఆ ఇల్లు ఖాళీ చేసి తక్కువ అద్దె ఉన్న మ రో ఇంటికి వెళ్లడం ఆమెకు పరిపాటిగా మారింది. ఇది కేవలం పలమనేరు ప్రాంతంలోనే కాదు జిల్లాలో అద్దె ఇంటిదారుల పరిస్థితి. అద్దెల భారం పట్టణాలు, నగరాల్లో అయితే మరీ ఎక్కువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కొండెక్కా యి. సూపర్‌సిక్స్ మాయమైంది. దీంతో పేదల బతుకులు భారంగా మారాయి. ఇక పంచాయతీలు, ము న్సిపాటిలిటీ, కార్పొరేషన్లలో ఇంటి పన్ను, నీటి పన్ను లు పెంచేశారు. దీంతో అద్దె పెంచాల్సి వచ్చిందని ఇంటి యజమానులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన ఇంటి అద్దెలు
గత రెండేళ్లకు ఇప్పటికీ ఇంటి అద్దెలు రెట్టింపు అయ్యా యి. చిత్తూరు, పలమనేరు, కుప్పం లాంటి చోట్ల ఇంటి అద్దె రూ.4 వేలు నుంచి రూ.8 వేలు వరకు ఉంది. పుంగనూరు, నగిరి, పుత్తూరులో రూ.6 వేలుగా ఉంది. ఇక మండల కేంద్రాల్లో రూ.3 నుంచి రూ.4 వేలుగా ఉంది. గతంలో పెద్దనోట్ల రద్దుతో అద్దెల భారం ఎ క్కువైంది. అప్పటి నుంచి ఇంటి యజమానులు ఏటా అద్దెను కొంత పెంచుతూ వచ్చారు. దీనికి తోడు అన్ని వస్తువులపై జీఎస్టీ రావడంతో అధికభారం పడింది. పంచాయతీల్లో మొదలు, మున్సిపాలిటీలో ఇంటి, నీ టి పన్నులు పెంచేశారు. దీంతో ఇంటి యజమానులు ఈ దఫా ఎక్కువగా అద్దెలు పెంచేశారు.
అద్దె ఇళ్లలో మరెన్నో సమస్యలు
అద్దె ఇంట్లో ఏదేని శుభకార్యమైతే పర్వాలేదు కానీ అశుభ కార్యమైతే ఇంటి యజమానులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమయాల్లో అంత్యక్రియలు సొంత ఊర్లలో చేసుకోవాల్సి వస్తోంది. ఇన్ని సమస్యల మధ్య అలవాటు పడిన చోటును వదులుకోలేక పెంచిన అద్దెలు కష్టమైనా చెల్లిస్తున్నారు. కాదు కూడదు అంటే వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సిందే. వెంటనే మరో అద్దె ఇల్లు దొరుకుందా? అంటే అదీ సమస్యే. దీంతో అద్దె ఇళ్లలో కాపురాలుండేవారు తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో అర్థంగాక కుమిలిపోతున్నారు.
అద్దెల నియంత్రణకు చట్టాలూ కరువే
వ్యవస్థాగతంగా అద్దెల నియంత్రణకు చట్టాలు, నిబంధనలు లేకపోవడం ఇంటి యజమానులకు వరంలా మారింది. దీంతో వారు ఇష్టానుసారంగా ఏటా అద్దెలు పెంచుతున్నా.. వీరిని ప్రశ్నించేవారే లేరు. గతంలో పదేళ్లకు, ఐదేళ్లకు, మూడేళ్లకు అద్దె ఇంట్లో ఉండేలా యజమానులు అగ్రిమెంట్లు రాసిచ్చేవారు. ప్రస్తుతం ఏడాదికి మాత్రమే అగ్రిమెంట్లను రాసిస్తున్నారు.
జిల్లా సమాచారం
జిల్లాలో మొత్తం జనాభా 18.72 లక్షలు
(2011 జనాభా లెక్కల మేరకు)
ప్రస్తుత జనాభా సుమారు 23 లక్షల దాకా
అసెంబ్లీ నియోజకవర్గాలు 6
మండలాలు 32
మున్సిపాలిటీలు 4, కార్పొరేషన్ 1
జిల్లాలోని ఇళ్లు 6,39,953
అద్దె ఇళ్లు సుమారు 80వేలు
నెలొస్తే ఇంటి అద్దెతో భయమేస్తుంది
నేను మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గతంలో రూ.2,500 ఉన్న అద్దె ఇప్పుడు రూ.6 వేలు అయ్యింది. నెలకు రూ.350 వస్తున్న కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.550 వరకు వస్తోంది. అద్దె ఇలా పెంచుతూపోతే ఎలా అని ఓనర్‌ను అడిగితే గతంలో ఉన్న ఇంటిపన్ను ఇప్పుడు డబులైంది. మీకు ఇష్టం ఉంటే ఉండండి లేదా వేరే ఇల్లు చూసుకోమని చెబుతున్నాడు ఇంటి ఓనర్. నాకొచ్చే సంపాదనలో సగం ఇంటి అద్దెకు పోతే ఎలా కుటుంబాన్ని పోషించాలో ఏమో. – జ్యోతి, పలమనేరు
చట్టాలు రావాలి
నేను గతంలో అమెరికా వెళ్లి వచ్చా. అక్కడ మా పిల్లలున్నారు. అక్కడి ప్రభుత్వం ఇంట్లోని సౌకర్యాలు, విస్తీర్ణం తదితరాలను సర్వే చేసి, అద్దె నిర్ణయిస్తుంది. యజమాని ఇస్టానుసారంగా అద్దెలు పెంచడం జరగదు. అలాంటి చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తే అద్దెల భారం తగ్గుతుంది. ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో దీన్ని అమలు చేస్తే బాగుంటుంది.
– గురురాజారావు, రిటైర్డ్ టీచర్, పలమనేరు

● సగం సంపాదన ఇంటి అద్దెకే! ● పట్టణాల్లోనే కాదు పల్లెల్ల

● సగం సంపాదన ఇంటి అద్దెకే! ● పట్టణాల్లోనే కాదు పల్లెల్ల